LinkedIn పరిచయం
ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాలు మరియు ప్రాంతాలలో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద నిపుణుల నెట్‌వర్క్‌గా రాణిస్తున్న LinkedInకి స్వాగతం.
విజన్
గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లోని ప్రతి సభ్యుని కోసం ఆర్థికపరమైన అవకాశాలను సృష్టించడం.
మిషన్
LinkedIn మిషన్ సామాన్యమైనది: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొఫెషనల్‌లు మరింత ఉత్పాదకంగా మరియు విజయవంతంగా మారడంలో సహాయపడేందుకు వారిని కనెక్ట్ చేయడం.
మేము ఎవరు?
LinkedIn అనేది 2002లో సహ-వ్యవస్థాపకుడైన రీడ్ హాఫ్‌మ్యాన్ లివింగ్ రూమ్‌లో రూపుదిద్దుకోవడం మొదలై, మే 5, 2003వ తేదీన అధికారికంగా ప్రారంభించబడింది.
నేడు, LinkedIn ర్యాన్ రోస్‌లాన్‌స్కీ నేతృత్వంలో సభ్యుల రిజిస్ట్రేషన్‌లు, యాడ్ విక్రయాలు మరియు రిక్రూట్‌మెంట్ సొల్యూషన్‌ల నుంచి ఆదాయాన్ని పొందుతూ, వైవిధ్యమైన వ్యాపారంగా ముందుకు సాగుతోంది. డిసెంబర్ 2016లో, LinkedInను Microsoft అధికారికంగా స్వాధీనం చేసుకుని, ప్రపంచంలోని ప్రముఖ ప్రొఫెషనల్ క్లౌడ్ మరియు ప్రపంచంలోని ప్రముఖ నిపుణుల నెట్‌వర్క్‌ను కలిపింది.
మా కంపెనీ గురించి మరింత సమాచారం కోసం: